1 Chronicles 2

Inizia questo capitolo con l'AI

Chiedi all’IA di questo capitolo

Rimani nel testo e chiedi del movimento, tensione, sfondo e cosa rivela questo capitolo nel libro più ampio.

1 ఇశ్రాయేలు కొడుకులు వీళ్ళు: రూబేను, షిమ్యోను, లేవీ, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను, 2 దాను, యోసేపు, బెన్యామీను, నఫ్తాలి, గాదు, ఆషేరు. 3 యూదా కొడుకులు ఏరు, ఓనాను, షేలా అనేవాళ్ళు. ఈ ముగ్గురి తల్లి ఒక కనానీయురాలు. ఆమె షూయ అనేవాడి కూతురు. యూదా పెద్దకొడుకు పేరు ఏరు. ఇతడు యెహోవా దృష్టిలో పాపం చేశాడు. అందుకని యెహోవా అతణ్ణి చంపాడు. 4 తరువాత అతని కోడలైన తామారు ద్వారా అతనికి పెరెసు, జెరహు అనే కొడుకులు పుట్టారు. యూదాకు మొత్తం ఐదుగురు కొడుకులు. 5 పెరెసు కొడుకులు హెస్రోను, హామూలు అనేవాళ్ళు. 6 జెరహుకు ఐదుగురు కొడుకులు కలిగారు. వీరు జిమ్రీ, ఏతాను, హేమాను, కల్కోలు, దారా. 7 కర్మీ కొడుకుల్లో ఒకడి పేరు ఆకాను. ఇతడు శాపానికి గురైన వస్తువుల్లో కొన్నిటిని దొంగతనం చేశాడు. అలా చేసి ఇశ్రాయేలీయులను ఎంతో యాతన పెట్టాడు. 8 ఏతాను కొడుకు పేరు అజర్యా. 9 హెస్రోనుకు పుట్టిన కొడుకులు యెరహ్మెయేలు, రము, కెలూబై. 10 రముకు అమ్మీనాదాబు, అమ్మీనాదాబుకు నయస్సోను పుట్టాడు. ఈ నయస్సోను యూదా ప్రజలకి నాయకుడిగా ఉన్నాడు. 11 నయస్సోనుకు శల్మాను పుట్టాడు, శల్మానుకు బోయజు పుట్టాడు. 12 బోయజుకు ఓబేదు పుట్టాడు. ఓబేదుకు యెష్షయి పుట్టాడు. 13 యెష్షయి పెద్ద కొడుకు పేరు ఏలీయాబు. రెండోవాడు అబీనాదాబు, మూడోవాడు షమ్మా, 14 నాల్గోవాడు నెతనేలు, ఐదోవాడు రద్దయి, 15 ఆరోవాడు ఓజెము, ఏడోవాడు దావీదు. 16 వీళ్ళకు ఇద్దరు అక్కచెల్లెళ్ళు. వాళ్ళు సెరూయా అబీగయీలు. సెరూయాకు అబీషై, యోవాబు, అశాహేలు అనే ముగ్గురు కొడుకులు పుట్టారు. 17 అబీగయీలుకు అమాశా పుట్టాడు. ఈ అమాశా తండ్రి యెతెరు అనే ఇష్మాయేలీయుడు. 18 హెస్రోను కొడుకు కాలేబుకు అజూబా అనే తన భార్య వల్లా, యెరీయోతు అనే ఆమె వల్లా పిల్లలు కలిగారు. అజూబా కొడుకులు యేషెరు, షోబాబు, అర్దోను. 19 అజూబా చనిపోయిన తరువాత కాలేబు ఎఫ్రాతా అనే ఆమెను పెళ్ళిచేసుకున్నాడు. ఆమె వల్ల అతనికి హూరు పుట్టాడు. 20 హూరుకు ఊరీ పుట్టాడు. ఊరీకి బెసలేలు పుట్టాడు. 21 తరువాత హెస్రోను అరవై ఏళ్ల వయస్సప్పుడు మాకీరు కూతుర్ని పెళ్ళి చేసుకున్నాడు. ఈ మాకీరు గిలాదుకు తండ్రి. హెస్రోనుకు సెగూబు పుట్టాడు. 22 సెగూబుకు యాయీరు పుట్టాడు. ఇతని ఆధీనంలో గిలాదు దేశంలో ఇరవై మూడు పట్టణాలు ఉండేవి. 23 వీళ్ళ దగ్గరనుండి యాయీరు పట్టణాలనూ, కెనాతునూ, వీటి చుట్టూ ఉన్న మరో అరవై ఊళ్లనూ గెషూరు వాళ్లూ అరామీయులూ తీసుకున్నారు. వీళ్ళంతా గిలాదుకు తండ్రి అయిన మాకీరు సంతానం. 24 హెస్రోను చనిపోయిన తరువాత కాలేబు-ఎఫ్రతా పట్టణంలో హెస్రోను భార్య అష్షూరును కన్నది. ఈ అష్షూరు తెకోవ అనే వాడికి తండ్రి. 25 హెస్రోను పెద్దకొడుకు యెరహ్మెయేలు. ఈ యెరహ్మెయేలు పెద్ద కొడుకు రము. మిగిలిన కొడుకులు ఎవరంటే బూనా, ఓరెను, ఓజెము, అహీయా అనేవాళ్ళు. 26 ఈ యెరహ్మెయేలుకు మరో భార్య ఉంది. ఆమె పేరు అటారా. ఈమె ఓనాము తల్లి. 27 యెరహ్మెయేలు పెద్దకొడుకు రముకు మయజూ, యామీను, ఏకెరు అనే కొడుకులున్నారు. 28 ఓనాము కొడుకులు షమ్మయి, యాదాలు. షమ్మయి కొడుకులు నాదాబు, అబీషూరు. 29 అబీషూరు భార్య పేరు అబీహయిలు. ఈమె ద్వారా అబీషూరుకు అహ్బాను, మొలీదు అనే పేరున్న కొడుకులు పుట్టారు. 30 నాదాబు కొడుకులు సెలెదు, అప్పయీము. సెలెదు పిల్లలు పుట్టకుండానే చనిపోయాడు. 31 అప్పయీం కొడుకుల్లో ఇషీ అనే వాడున్నాడు. ఇషీ కొడుకుల్లో షేషాను అనే వాడున్నాడు. షేషాను కొడుకుల్లో అహ్లయి అనే వాడున్నాడు. 32 షమ్మయికి సోదరుడైన యాదా కొడుకులు యెతెరు, యోనాతాను. వీరిలో యెతెరు ఎలాంటి సంతానం లేకుండానే చనిపోయాడు. 33 యోనాతాను కొడుకులు పేలెతు, జాజా. వీళ్ళంతా యెరహ్మెయేలు వారసులు. 34 షేషానుకు కూతుళ్ళు పుట్టారు గానీ కొడుకులు కలగలేదు. ఈ షేషానుకు యరహా అనే ఒక దాసుడున్నాడు. వాడు ఐగుప్తీయుడు 35 షేషాను తన కూతుర్ని ఈ యరహాకు ఇచ్చాడు. యరహాకు ఆమె ద్వారా అత్తయి పుట్టాడు. 36 అత్తయికి నాతాను పుట్టాడు. నాతానుకి జాబాదు పుట్టాడు. 37 జాబాదుకి ఎప్లాలు పుట్టాడు. ఎప్లాలుకి ఓబేదు పుట్టాడు. 38 ఓబేదుకి యెహూ పుట్టాడు. యెహూకి అజర్యా పుట్టాడు. 39 అజర్యాకి హేలెస్సు పుట్టాడు. హేలెస్సుకి ఎలాశా పుట్టాడు. 40 ఎలాశాకి సిస్మాయీ పుట్టాడు. సిస్మాయీకి షల్లూము పుట్టాడు. 41 షల్లూముకి యెకమ్యా పుట్టాడు. యెకమ్యాకి ఎలీషామా పుట్టాడు. 42 యెరహ్మెయేలు తోడబుట్టిన వాడు కాలేబు కొడుకులెవరంటే మేషా, మారేషా. వీరిలో మేషా పెద్దవాడు. ఇతని కొడుకు జీఫు. మారేషా కొడుకు పేరు హెబ్రోను. 43 హెబ్రోను కొడుకులు కోరహు, తప్పూయ, రేకెము, షెమ. 44 షెమకు రహము పుట్టాడు. ఈ రహము యోర్కెయాముకు తండ్రి. రేకెముకు షమ్మయి పుట్టాడు. 45 షమ్మయి కొడుకు మాయోను. ఈ మాయోను బేత్సూరుకు తండ్రి. 46 కాలేబు ఉంపుడుకత్తె అయిన ఏయిఫా హారాను, మోజాను, గాజేజులకు జన్మనిచ్చింది. హారానుకు గాజేజు పుట్టాడు. 47 యెహ్దయి కొడుకులు రెగెము, యోతాము, గేషాను, పెలెటు, ఏయిఫా, షయపు. 48 కాలేబు ఉంపుడుకత్తె అయిన మయకా షెబెరుకీ, తిర్హనాకీ జన్మనిచ్చింది. 49 ఆమెకి ఇంకా షయపు, షెవాను పుట్టారు. వీరిలో షయపుకు మద్మన్నా, షెవానుకు గిబీ వాడు మక్బేనా పుట్టారు. కాలేబు కూతురి పేరు అక్సా. 50 ఇక కాలేబు సంతానం ఎవరంటే, ఎఫ్రాతా వల్ల అతనికి మొదట హూరు పుట్టాడు. హూరుకు శోబాలు, శల్మా, హారేపు పుట్టారు. 51 వీళ్ళలో శోబాలుకు కిర్యత్యారీము, శల్మాకు బేత్లెహేము, హారేపుకు బేత్గాదేరు పుట్టారు. 52 కిర్యత్యారీము తండ్రి అయిన శోబాలు వారసులు హారోయే, ఇంకా మనుహోతీయుల్లో సగం మంది ఇతని వంశం వాళ్ళే. 53 కిర్యత్యారీముకు చెందిన తెగలు ఎవరంటే ఇత్రీయులూ, పూతీయులూ, షుమ్మాతీయులూ, మిష్రాయీయులు. వీరినుండి జొరాతీయులూ, ఎష్తాయులీయులూ వచ్చారు. 54 శల్మాకు సంబంధించిన తెగలు ఇవి, బేత్లెహేము, నెటోపాతీయులూ, యోవాబు కుటుంబానికి సంబంధించిన అతారోతీయులూ, మానహతీయుల్లో సగ భాగంగా ఉన్న జారీయులూ. 55 యబ్బేజులో నివసించే లేఖికుల కుటుంబాలైన తిరాతీయులూ, షిమ్యాతీయులూ, శూకోతీయులూ. వీళ్ళు రేకాబు కుటుంబాలకు పూర్వీకుడైన హమాతుకు వారసులుగా కలిగిన కేనీయులు.

Trasforma la lettura in vero studio

Registrati per salvare versetti, prendere note e studiare con strumenti AI.

Scegli il tuo prossimo passo dopo questo capitolo Continua a leggere, scegli un piano o continua a studiare con l'AI.
Segui i temi che questo capitolo apre Argomenti correlati per le domande più ampie che questo capitolo potrebbe aver aperto.