Psalms 113

Start this chapter with AI

Ask AI

Stay in the text and ask about the movement, tension, background, and what this chapter reveals inside the larger book.

1 యెహోవాను స్తుతించండి. యెహోవా సేవకులారా, ఆయనను స్తుతించండి. యెహోవా నామాన్ని స్తుతించండి. 2 ఇప్పుడు, ఎల్లకాలం యెహోవా నామానికి సన్నుతి. 3 సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకూ యెహోవా నామం స్తుతినొందదగినది. 4 యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు. ఆయన మహిమ ఆకాశాన్ని అంటుతున్నది. 5 ఉన్నత స్థలంలో ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలినవాడెవడు? 6 ఆయన భూమినీ ఆకాశాన్నీ వంగి చూస్తున్నాడు. 7 ఆయన దుమ్ములోనుండి దరిద్రులను లేవనెత్తుతాడు. బూడిద కుప్ప మీద నుండి పేదలను పైకెత్తుతాడు. 8 ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చోబెట్టడం కోసం ఆయన ఇలా చేస్తాడు. 9 ఆయన పిల్లలు లేని దాన్ని ఇల్లాలుగా చేస్తాడు. ఆమెకు పిల్లల తల్లిగా సంతోషం కలగజేస్తాడు. యెహోవాను స్తుతించండి.

Turn reading into real study

Sign up to bookmark verses, take notes, and study with AI-powered tools.

Choose your next step after this chapter Keep reading, choose a plan, or keep studying with AI.
Follow the themes this chapter opens Related topic hubs for the larger questions this chapter may have opened.